Thalakondapally: సీఈఐఆర్ ద్వారా 10 ఫోన్లు రికవరీ చేసిన తలకొండపల్లి పోలీసులు!

Thalakondapally: తలకొండపల్లి మండలంలో CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 10 మొబైల్ ఫోన్లను సీఐ జానకిరామ్ రెడ్డి, ఎస్సై శేఖర్ బాధితులకు అప్పగించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Aug 2026 3:37 PM IST
Thalakondapally
X

Thalakondapally: సీఈఐఆర్ ద్వారా 10 ఫోన్లు రికవరీ చేసిన తలకొండపల్లి పోలీసులు!

Thalakondapally: తలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుండి పోగొట్టుకున్న మరియు దొంగలించబడిన సెల్ ఫోన్లను CEIR - Central Equipment Identity Register పోర్టల్ ద్వారా గుర్తించి, ఈరోజు బాధితులకు అప్పగించడం జరిగింది. తలకొండపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ కానిస్టేబుల్ జాషువా గత కొంతకాలంగా CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదులు అందిన సెల్ ఫోన్లను టెక్నికల్ ఆధారాలతో ట్రేస్ చేసి రికవరీ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 10 మంది బాధితులకు చెందిన సెల్ ఫోన్లను తలకొండపల్లి ఇన్స్పెక్టర్ వి. జానకిరామ్ రెడ్డి మరియు ఎస్సై కె.శేఖర్ చేతుల మీదుగా బాధితులకు తిరిగి అప్పగించారు. సెల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీస్ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "పోయిన ఫోన్ తిరిగి వస్తుందనే ఆశ లేదు.

కానీ పోలీసులు చూపిన చొరవ, కృషి వల్ల మా ఫోన్లు మాకు తిరిగి వచ్చాయి" అని బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వి. జానకిరామ్ రెడ్డి మాట్లాడుతూ, క్రైమ్ కానిస్టేబుల్ జాషువా CEIR పోర్టల్ ద్వారా చేసిన కృషిని అభినందించారు. ప్రజల ఆస్తిని కాపాడడం, వారికి న్యాయం చేయడం పోలీసు శాఖ ప్రధాన విధి అని, ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడమే మా లక్ష్యమని తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story