Nagarkurnool: నాగర్‌కర్నూల్ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా రవి గౌడ్!

Nagarkurnool: బీజేపీ ఓబీసీ మోర్చా నాగర్‌కర్నూల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌‌గా తిరుమణి రవి గౌడ్ నియామకం పార్టీ అభ్యున్నతికి, బీసీ వర్గాల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని వెల్లడి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Oct 2026 9:19 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: నాగర్‌కర్నూల్ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా రవి గౌడ్!

నాగర్‌కర్నూల్: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నాగర్‌కర్నూల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా తనను నియమించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తిరుమణి రవి గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, తల్లోజు ఆచారి అన్నకు, నాగర్‌కర్నూల్ జిల్లా పార్టీ నాయకులకు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా అధ్యక్షులు జెట్టి వెంకటేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తన నియామకానికి సహకరించిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతను పదవిగా కాకుండా ఓబీసీ సమాజానికి, పార్టీకి సేవ చేసే గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు రవి గౌడ్ పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నాయకుల మార్గదర్శకత్వంలో, కార్యకర్తల సహకారంతో ఓబీసీ మోర్చాను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY