Narayanpet: నేటి బాలలే దేశ భవిష్యత్తు.. బాలల భద్రతే మన బాధ్యత: జడ్జి

Narayanpet: నారాయణపేట కృష్ణవేణి హై స్కూల్‌లో జరిగిన బాలల దినోత్సవ అవగాహన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ పోక్సో చట్టం, బాలల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 13 Nov 2026 9:28 PM IST
Narayanpet
X

Narayanpet: నేటి బాలలే దేశ భవిష్యత్తు.. బాలల భద్రతే మన బాధ్యత: జడ్జి

నారాయణపేట జిల్లా: బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూల్ లో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వింధ్య నాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరై, పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. బాలల దినోత్సవం ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, దేశ ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు.

పిల్లల హక్కులు, వారి భద్రత, విద్య మరియు సంక్షేమం గురించి సమాజంలో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. రేపు నవంబర్ 14వ తేదీ రెండవ శనివారం సెలవు దినం కావడంతో, నవంబర్ 13వ తేదీనే బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించబడిందని తెలిపారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని, ప్రతి బిడ్డకు చదువుకునే హక్కు ఉందని తెలిపారు.

పిల్లల భద్రత కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన పోక్సో చట్టం గురించి వివరించారు. ఎవరైనా చెడుగా తాకినా, భయపెట్టినా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పోలీసులకు చెప్పాలని సూచించారు.

లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె. లక్ష్మిపతి గౌడ్ గారు మాట్లాడుతూ, DLSA పాత్ర మరియు ఉపయోగాలను వివరించారు. DLSA ద్వారా పేదలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, టోల్ ఫ్రీ నంబర్ 15100 గురించి వివరించారు. "ఈ రోజు మీరు తెలుసుకున్న చట్టాలను ఇంటికి వెళ్లి మీ తల్లిదండ్రులకు, తోటి స్నేహితులకు తప్పక చెప్పండి" అని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ కె. లక్ష్మిపతి గౌడ్, నందునమాజీ సీనియర్ అడ్వకేట్, పాఠశాల, చైల్డ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ నర్సిములు, పోలీస్ అధికారి కృష్ణయ్య గౌడ్ ASI, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇమ్రాన్ పాష మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA