Mahabubnagar: సింహగిరి స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ!

Mahabubnagar: మహబూబ్‌నగర్ కామేశ్వరీ ఐశ్వర్వేశ్వర ఆలయ నవరాత్రుల్లో టీపీసీసీ నేత మిథున్ రెడ్డి, మేయర్ మమత స్వామివారికి సువర్ణ పట్టు వస్త్రాలు సమర్పించారు.

Srinivasulu, Madanapalle
Published on: 11 Oct 2026 1:05 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: సింహగిరి స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ!

Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తగంజ్ సింహగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు శ్రీ శ్రీ శ్రీ కామేశ్వరీ సమేత ఐశ్వర్వేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహబూబ్‌నగర్ మేయర్ శ్రీమతి గుమ్మల మమత శ్రీనివాస్ గారు,టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఏపి మిథున్ రెడ్డి గారు మరియు కార్పొరేటర్ యాదయ్య గారు స్వామివారికి సువర్ణ నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ గ్రేన్స్ & సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ భవనం నుంచి ఆలయ సుందరీకరణ కమిటీ సభ్యులు,అసోసియేషన్ సంఘ ప్రతినిధులు,ఆలయ ప్రతినిధులు,భక్తులతో కలిసి మంగళ వాయిద్యాల నడుమ దేవస్థానానికి ఘనంగా ఊరేగింపుగా చేరుకున్నారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle