Achampet: అచ్చంపేటలో ప్రమాదకర ప్రయాణం.. డోర్ లేని ట్రాక్టర్‌తో హడల్!
Achampet: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో వెనుక డోర్ లేకుండా గ్రానైట్ రాళ్ల లోడ్‌తో ట్రాక్టర్ ప్రమాదకరంగా వెళ్లింది. అధికారులపై స్థానికుల ఆగ్రహం.
Achampet: అచ్చంపేటలో ప్రమాదకర ప్రయాణం.. డోర్ లేని ట్రాక్టర్‌తో హడల్!
Achampet: ఇరుకైన వీధిలో వెనుక డోర్ లేకుండా గ్రానైట్ రాళ్ల లోడ్ తో ప్రమాదకరంగా వెళ్తున్న ట్రాక్టర్ ను చూసి వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ట్రాక్టర్ ట్రాలీ వెనుక భాగంలో డోర్ లేకపోవడంతో లోడ్ చేసిన భారీ రాళ్లు ఎప్పుడు కింద పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వెనుక వస్తున్న ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
గ్రామంలోని ప్రధాన రహదారిపై ఇలా నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా లోడ్ తరలిస్తున్నా పోలీసులు, మైనింగ్, రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాళ్లు కింద పడితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే ఇలాంటి వాహనాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




