Nagarkurnool: పలుగు తండాలో అర్ధరాత్రి దొంగతనం 13 మేకల నొకేసిన కేటుగాళ్లు!
Nagarkurnool: పలుగు తండాలో 13 మేకలు దొంగతనానికి గురయ్యాయి. బాధితుడు బాల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు.
Nagarkurnool: పలుగు తండాలో అర్ధరాత్రి దొంగతనం 13 మేకల నొకేసిన కేటుగాళ్లు!
నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తులు 13 మేకలను దొంగిలించిన ఘటన మండల పరిధిలోని పలుగు తండా గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బాల్య శనివారం సాయంత్రం ఎప్పటిలాగే తన 40 మేకలను తన ఇంటి పక్కల ఉన్న మేకల షెడ్డులో ఉంచి రాత్రి 11 గంటల సమయంలో తన ఇంట్లో పడుకోవడం జరిగింది. అర్ధరాత్రి 01:30 గంటల సమయంలో మా ఇంటి పక్కల ఉన్న నేనావత్ బుజ్జి అనే మహిళ ఇచ్చిన సమాచారం మేరకు ఫిర్యాదుదారుడు బాల్య చూడగా మొత్తం 40 మేకలకు గాని 23 మేకలే ఉన్నాయని, మిగతా 13 మేకలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్టు అనుమానంతో ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా అపహరణకు గురైన మేకల విలువ సుమారు రూ. 1,80,000 ఉంటుందని బాధితులు తెలిపారు.




