Nagarkurnool: నిరుపేద కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అండ సిమెంట్ పంపిణీ!
Nagarkurnool: వెల్దండలో నిరుపేద కుటుంబానికి సొంతింటి నిర్మాణ పనుల కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉప్పల వెంకటేష్ సిమెంట్ పంపిణీ.
Nagarkurnool: నిరుపేద కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అండ సిమెంట్ పంపిణీ!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. వెల్దండ మండలానికి చెందిన బాచేపల్లి శ్రీను, బాలస్వామి కుటుంబం ఇంటి నిర్మాణాన్ని చేపట్టగా, ఫినిషింగ్ పనుల కోసం తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా సిమెంట్‌ను అందజేశారు. నిరుపేద కుటుంబాల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తామని ఉప్పల వెంకటేష్ తెలిపారు.
ఇంటి నిర్మాణానికి సిమెంట్ అందించినందుకు కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షులు కానుల జోగయ్య, మాజీ ఎంపీటీసీ చలిచీమల జ్యోతి నిరంజన్, బాచేపల్లి గోపాల్, కుమార్ ముదిరాజ్, పూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.




