Veldanda: చేర్కూర్‌లో ఘనంగా వన మహోత్సవం: మొక్కలు నాటిన సర్పంచ్!
Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చేర్కూర్‌లో వన మహోత్సవం ఘనంగా జరిగింది. గ్రామాన్ని పచ్చదనంతో నింపాలని సర్పంచ్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
Veldanda: చేర్కూర్‌లో ఘనంగా వన మహోత్సవం: మొక్కలు నాటిన సర్పంచ్!
Veldanda: పర్యావరణాన్ని కాపాడుకోవడం మరియు గ్రామాన్ని పచ్చదనంతో నింపడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చేర్కూర్ గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు పిలుపునిచ్చారు, మంగళవారం చేర్కూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసులు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి గ్రామపంచాయతీ ఆవరణంలో మొక్కలు నాటారు, అనంతరం సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్క సంరక్షించి మహా వృక్షాలుగా పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించాలంటే మొక్కల పెంపకం అత్యంత ఆవశకమని అన్నారు.
గ్రామ ప్రజలందరూభాగస్వాములై ఇండ్ల ఆవరణంలో ఖాళీ స్థలాలలో మొక్కలు నాటి చేర్కూర్ గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ శ్రీనివాసులు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండల్,గ్రామపంచాయతీ కార్యదర్శి బాలురాజు, ఏపీవో ఈశ్వర్, వార్డు మెంబర్ పురుగుల లాలయ్య, రమేష్, జంగయ్య, బాలకృష్ణ,కృష్ణయ్య మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.




