Vangoor: నారమోని నాగరాజు కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం!

Vangoor: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరులో అనారోగ్యంతో మరణించిన నాగరాజు కుటుంబానికి బీఆర్‌ఎస్ నాయకుడు గణేష్‌రావు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 Oct 2026 4:42 PM IST
Vangoor
X

Vangoor: నారమోని నాగరాజు కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం!

Vangoor: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రానికి చెందిన నారమోని నాగరాజు అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకుడు వేనేపల్లి గణేష్‌రావు, మాజీ సర్పంచ్ అక్కి లావణ్య ఎల్లాగౌడ్, గ్రామ ఉపసర్పంచ్ బండపల్లి భాస్కర్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, నాగరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బండపల్లి జంగయ్య, వార్డు సభ్యులు సుమన్, అక్కి మురళి, నారమోని జంగయ్య, బండపల్లి శివకుమార్, లట్టుపల్లి మురళి, నారమోని రాజు, సోషల్ మీడియా ఇన్‌చార్జి ఎల్లికంటి మురళి, బాషమోని కృష్ణ, బండపల్లి శ్రీశైలం, బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY