Amrabad: రీలొకేషన్ వద్దు.. గ్రామాభివృద్ధి కావాలంటూ శ్రీశైలం హైవేపై ధర్నా!

Amrabad: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటువర్లపల్లిలో రీలొకేషన్ వద్దు-గ్రామాభివృద్ధి కావాలంటూ శ్రీశైలం హైవేపై గ్రామస్తుల ధర్నా. అటవీశాఖ అధికారులపై ఆగ్రహం.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 13 Oct 2026 12:11 PM IST
Amrabad
X

Amrabad: రీలొకేషన్ వద్దు.. గ్రామాభివృద్ధి కావాలంటూ శ్రీశైలం హైవేపై ధర్నా!

Amrabad: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి గ్రామంలో. రీ లొకేషన్ వద్దు గ్రామ అభివృద్ధి కావాలి అంటూ హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిu వటువర్లపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేసిన గ్రామస్తులు.

వటువర్లపల్లి గ్రామం అభివృద్ధి జరగకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని. గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి. తెచ్చుకుంటున్న ఇసుక కంకర రాకుండా అడ్డుకుంటున్నారని గ్రామంలో ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ మంజూరై నిర్మాణ మధ్యలో నిలిపివేశారు అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఆశ్రమ పాఠశాలకు కాంపౌండ్ వాల్ మంజూరైతే కూడా అటవీశాఖ అధికారులు ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తున్న పనులను నిర్మించకుండా కాంట్రాక్టర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

రీ లొకేషన్ పేరుతో గ్రామంలో కొంతమందిని భయభ్రాంతులకు గురిచేసి వారిని ప్రలోభాలకు గురిచేసి తరలించే ప్రయత్నం చేస్తున్నారని రీ లొకేషన్ వద్దు మా గ్రామమే ముద్దు మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము ఇక్కడే జీవిస్తామని గ్రామస్తులు అంటున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ లు సర్పంచ్ చత్రు నాయక్, సర్య నాయక్, వార్డు సభ్యులు చిట్టెమ్మ మౌనిక వెంకటపతి మాజీ వార్డు సభ్యులు సాలమ్మ భరత్ రమేష్ గ్రామ పెద్దలు ఇమ్మడి కిష్టయ్య కాశయ్య భవాని సత్తి అంజయ్య కృష్ణా నాయక్ రత్యానాయక్ మహిళా సంఘాల నాయకులు జ్యోతి అనసూయ ఈదమ్మ చిట్టెమ్మ గ్రామ యువకులు ప్రభాకర్ ఇమ్మడి అనిల్ మంతటి అంజి అఖిల్ శివకుమార్ సాయి సాయి మహిళలు గ్రామ యువకులు పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA