Veldanda: వెల్దండలో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్

Veldanda: నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండలో లబ్ధిదారురాలు అన్నెపు లక్ష్మమ్మ ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ నిర్వహించిన స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Nov 2026 5:57 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్

వెల్దండ: వెల్దండ మండల కేంద్రానికి చెందిన అన్నెపు లక్ష్మమ్మ కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ చేతుల మీదుగా ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తాం. లబ్ధిదారులు నాణ్యతతో ఇంటిని నిర్మించుకోవాలని అన్నారు.

లబ్ధిదారురాలు అన్నెపు లక్ష్మమ్మ మాట్లాడుతూ.. ఇల్లు మంజూరు చేసిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి, సర్పంచి మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, కార్యదర్శి గిరి,వార్డు సభ్యులు మారేపల్లి మంజుల శ్రీను, ముదికొండ కవిత రమేష్, పిల్లి దేవేందర్, ఎస్.శేఖర్,

నాయకులు ఎండి రషీద్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాదేపల్లి మల్లయ్య, బొక్కల శ్రీనివాస్, మట్ట భారత్, గడ్డం వెంకటయ్య, మల్లేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY