Veldanda: 1వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ
Veldanda: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని 1వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ మట్ట యాదమ్మ, సింగిల్ విండో చైర్మన్ భూపతి రెడ్డి భూమి పూజ చేశారు.
Veldanda: 1వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ
వెల్దండ: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. మండల కేంద్రంలోని 1వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ యెన్నం భూపతి రెడ్డి లు కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామాన్ని అన్ని వార్డుల్లో సమానంగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యమన్నారు, రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తాం" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్, కుందారం తండా సర్పంచ్ ఘన్య నాయక్,ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య, నాయకులు క్యాసరపు వెంకటయ్య, హమీద్, కృష్ణముదిరాజ్, ఎండి రషీద్, మల్లీశ్వరి రంగనాథం, కొండయ్య, కిష్టల్,శ్రీనివాస్, రమేష్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య, బొక్కల శ్రీనివాస్,వెంకటేష్, భరత్ గౌడ్, గజిని శ్రీను, ఈదులపల్లి శ్రీను, రాజు, నాగరాజు, ఫరీద్, రాజు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.




