Veldanda: వెల్దండలో శుభకార్యాలకు హాజరైన జైపాల్ యాదవ్, విజితా రెడ్డి

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్‌పల్లిలో పుట్టు వస్త్రావు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, డాక్టర్ విజితా రెడ్డి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 16 Aug 2026 6:20 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో శుభకార్యాలకు హాజరైన జైపాల్ యాదవ్, విజితా రెడ్డి

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఇన్‌చార్జ్ జైపాల్ యాదవ్, తెలంగాణ ఉద్యమకారురాలు డాక్టర్ విజితా రెడ్డి ఆదివారం నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు శుభకార్యాలకు హాజరై కుటుంబ సభ్యులను వధూవరులను, చిన్నారులను ఆశీర్వదించారు.

అలాగే వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన ధ్యాప సునీత వెంకట్ రెడ్డి దంపతుల కుమార్తెల సిద్ధిక్ష రెడ్డి సహస్ర రెడ్డి పుట్టు వస్తావు అలంకరణ కార్యక్రమంలో రాఘాయిపల్లి పరిధిలోని తోడేటి అశోక్ రెడ్డి గార్డెన్స్‌లో నూతన పట్టు వస్త్రాల అలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డాక్టర్ విజితా రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కుటుంబ శుభకార్యాల్లో పాల్గొని వారి సంతోషాన్ని పంచుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆనంద్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story