Veldanda: వెల్దండలో రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ బుధవార్‌పేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల తొలిరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Oct 2026 5:09 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం: మండల కేంద్రంలోని బుధవార్ పేట ఆంజనేయస్వామి దేవాలయంలో మండల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

మండల ఉత్సవ కమిటీ అధ్యక్షులు బొల్లంపల్లి అల్లం_పల్లి కృష్ణ కార్యదర్శి పాలాది సంతోష్ కార్యవర్గం ఆధ్వర్యంలో పూజలు ఘనంగా _నిర్వహిస్తున్నారు.

మొదటి రోజు అమ్మవారు రాజా రాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాసా తిరుపతయ్య దంపతులు పూజలు నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ రఘువీర్ రెడ్డి వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ తో పాటు పలువురు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు ఉత్సవ కమిటీ ముఖ్య _అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY