Veldanda: వెల్దండలో సోమవారం ప్రజావాణి ఎంపీడీవో సులోచన
Veldanda: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో ప్రతి సోమవారం ప్రజావాణి. ప్రజలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సులోచన పిలుపు.
Veldanda: వెల్దండలో సోమవారం ప్రజావాణి ఎంపీడీవో సులోచన
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఆగస్టు 16 : ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని వెల్దండ మండల ప్రజలు సద్వినియోగ పరచుకోవాలని ఎంపీడీవో సులోచన ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2026 ఆగస్టు 4న ఆదేశాల ప్రకారం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించ బడుతుందని పేర్కొన్నారు.
నేడు సోమవారం ఆగస్టు 17 ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు వెల్దండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజల యొక్క ఆర్జీలు ఫిర్యాదులు మరియు సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగవంతమైన పరిష్కారం పొందడానికి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ ప్రజావాణిలో అన్ని శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు హాజరవుతున్నారని తెలిపారు.




