Veldanda: సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికైన ఎన్నం భూపతిరెడ్డికి ఘన సన్మానం
Veldanda: వెల్దండ మండల PACS చైర్మన్‌గా నియమితులైన ఎన్నం భూపతిరెడ్డిని శాలువాతో సత్కరించిన మత్స్యకార సొసైటీ జిల్లా డైరెక్టర్ క్యాషారపు వెంకటయ్య.
Veldanda: సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికైన ఎన్నం భూపతిరెడ్డికి ఘన సన్మానం
వెల్దండ: ఉమ్మడి వెల్దండ మండల పిఎసిఎస్ చైర్మన్ గా మరోసారి నియమితులైన రెండు పర్యాయాలు వెల్దండ గ్రామ సర్పంచ్, ఒకసారి మండల పరిషత్ ఉపాధ్యక్షులు ప్రస్తుతం డిసిసి ఉపాధ్యక్షులుగా ప్రజలకు సేవలు అందిస్తున్న శ్రీ ఎన్నo భూపతిరెడ్డిని మత్స్యకార సొసైటీ నాగర్ కర్నూల్ జిల్లా డైరెక్టర్, వెల్దండ గ్రామ మాజీ ఉపసర్పంచ్ క్యాషారపు వెంకటయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
శనివారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో పిఎసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న ఎన్నo భూపతిరెడ్డిని వెల్దండ ఉప సర్పంచ్ బస్నవోని శ్రీనివాసులుతో కలిసి, మత్స్యకార సొసైటీ డైరెక్టర్ కాషారప వెంకటయ్య శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ ముదిరాజ్, పెంటయ్య, మట్ట నిరంజన్ గౌడ్, కృపానందం, ముదిగొండ రమేష్,గుండాల దేవాలయ కమిటీ సభ్యులు బాదేపల్లి మల్లేష్ ముదిరాజ్, మాజీ సభ్యులు భయ్య మల్లేష్ ముదిరాజ్, నాయకులు క్యాషారపు మల్లేష్, లింగం, రాంపురం శ్రీను తదితరులు పాల్గొన్నారు.




