Veldanda: తుక్కుగూడ వద్ద రోడ్డు ప్రమాదంలో వెల్దండ హెచ్‌ఎం భూపతి దాస్ మృతి!

Veldanda: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపతి దాస్ రోడ్డు ప్రమాదంలో మృతి. సర్పంచ్, ఉపాధ్యాయుల ఘన నివాళి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Nov 2026 2:19 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండ మండల కేంద్రంలో బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపతి దాస్ మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో తుక్కుగూడ దగ్గర మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ భూపతి దాస్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసిన మంచి ఉపాధ్యాయుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల పట్ల చూపిన ప్రేమ, క్రమశిక్షణ ఎన్నటికీ మరువలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏ. రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ బి. శ్రీను, జీపీఎచ్ఎస్ హెడ్ మాస్టర్ రవీందర్ నాయక్,

సునీత, వార్డు సభ్యులు మసిగుండ్ల వెంకటేష్, మారేపల్లి మంజుల శ్రీను, కొయ్యల పుల్లయ్య, మట్ట విష్ణు, ఉపాధ్యాయ బృందం

పావని, శ్రీ లక్ష్మి, సంతోషి రాణి, సుగుణ, తిరుపతి, చంద్రశేఖర్, అంజియా నాయక్, మరియు పాఠశాల విద్యార్థుని విద్యార్థులు తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY