Veldanda: వెల్దండలో అక్రమ మద్యం స్థావరాలపై అధికారుల దాడులు!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల తండాల్లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్త దాడిలో 1,450 లీటర్ల ఎఫ్‌జే వాష్ ధ్వంసం, ఒకరి అరెస్ట్.
Veldanda: వెల్దండలో అక్రమ మద్యం స్థావరాలపై అధికారుల దాడులు!
Veldanda: అక్రమ మద్యం తయారీ, నిల్వ, విక్రయాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్‌టీఎఫ్ హైదరాబాద్, ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ మహబూబ్‌నగర్, డీటీఎఫ్ నాగర్‌కర్నూల్, కల్వకుర్తి పోలీస్ బృందాలు బుధవారం వెల్దండ మండలంలోని పోచమ్మగడ్డ తండా, సిలోనిబావి తండా ప్రాంతాల్లో సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.
దాడుల్లో అక్రమంగా తయారు చేస్తున్న 1,450 లీటర్ల ఎఫ్‌జే వాష్‌ను ధ్వంసం చేశారు. అలాగే 10 లీటర్ల ఐడీ లిక్కర్, 480 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసి, మొత్తం ఆరు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో డీటీఎఫ్ సీఐ నాగార్జున రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ తిరుపతి రెడ్డి, ఎస్‌టీఎఫ్ సీఐ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి ఎస్‌హెచ్‌ఓ కె. రవిచంద్ర రెడ్డి, ఎస్‌ఐ చాంద్‌బీ షేక్‌తో పాటు ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమ మద్యం తయారీ, రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అక్రమ మద్యం నిర్మూలనకు సంబంధించి తనిఖీలు, దాడులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.




