Veldanda: మృతుని కుటుంబానికి వెల్దండ సర్పంచ్ ఆర్థిక సాయం

Veldanda: వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఎం.దాసు మృతి చెందగా, గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Oct 2026 2:10 PM IST
Veldanda
X

Veldanda: మృతుని కుటుంబానికి వెల్దండ సర్పంచ్ ఆర్థిక సాయం

నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఎం.దాసు మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ వారి కుటుంబానికి మంగళవారం 5 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో వెల్దండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొయ్యల పుల్లయ్య, మంగళగిరి శ్రీను, బిట్టి చందు,టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జంగిలి ఆనంద్ రాజ్, ఎండి సమీర్, తుంగ శ్రీను, పుట్ట శివ,బిట్టి సైదులు,సిద్ధు, రమేష్, కూన నాని,బాలరాజ్, గోపాల్ తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY