Veldanda: గణేష్ మండప నిర్వాహకులకు సూచనలు పాటించాలని ఎస్సై యుగంధర్ రెడ్డి

Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్సై యుగంధర్ రెడ్డి సమావేశం నిర్వహించి పోలీసు నిబంధనలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 10 Sept 2026 9:18 PM IST
Veldanda
X

Veldanda: గణేష్ మండప నిర్వాహకులకు సూచనలు పాటించాలని ఎస్సై యుగంధర్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాలలో గణేశ్ ఉత్సవాలను అంతా కలిసి మెలసి శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి సూచించారు వెల్దండ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎస్సై యుగంధర్ రెడ్డి అధ్వర్యంలో గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలను జరుపుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు వివరించారు. మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖకు మండపాల సమాచారం ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే అక్కడికి వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు.

కావాల్సిన బందోబస్త్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరికీ ఇబ్బందులు కలిగించకుండా ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. డీజేల వాడకం పూర్తిగా నిషేధమన్నారు. ముందుగానే మండపాలకు సంబంధించిన అనుమతి కోరుతూ సమాచారం పోలీస్ లకు అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆయా మండపాల నిర్వాహకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story