Veldanda: బొల్లంపల్లి చౌరస్తాలో శ్రీరామ ఫంక్షన్ హాల్ ప్రారంభం
Veldanda: కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం బొల్లంపల్లి చౌరస్తాలో నూతనంగా నిర్మించిన శ్రీరామ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.
Veldanda: బొల్లంపల్లి చౌరస్తాలో శ్రీరామ ఫంక్షన్ హాల్ ప్రారంభం
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి చౌరస్తా రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీరామ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఆలంపల్లి కృష్ణ, మండలి శ్రీనివాస్ యాదవ్, కానుగుల రమేష్,ఎండి రాజ్ మహ్మద్ లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటవడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ,స్థానిక నాయకులు వెంకట్రావ్ లతో పాటు ఫౌండేషన్ సభ్యులు కొండల్ యాదవ్,శ్రీరాములు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Next Story




