Veldanda: వెల్దండలో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం!

Veldanda: వెల్దండ మండల కేంద్రంలో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు. జెండా ఆవిష్కరించిన మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Aug 2026 3:21 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట వెంకటయ్య గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరికిషన్ తదితర నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ముందుగా మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్ మాట్లాడుతూ, మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యువకులు చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

పార్టీలో యువతకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఫుల్‌సింగ్ నాయక్, ఉప సర్పంచ్ శీను, వెల్దండ టౌన్ అధ్యక్షుడు బాధపెళ్లి మల్లయ్య, వెల్దండ టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జంగిలి ఆనంద్, వార్డు నెంబర్ గోసుల కొండయ్య, కాషారపు వెంకటయ్య, తారా సింగ్, దుర్గయ్య, దూల చంద్రశేఖర్, చుక్కనపల్లి అధ్యక్షుడు, రేవెల్లి రాజు, రచూరు గ్రామ అధ్యక్షుడు సతీష్, బొక్కల చంద్రశేఖర్, మట్ట శివ గౌడ్, ఎండి సమీర్, ఈదులపెళ్లి శ్రీనివాస్, పుట్ట శివ, డేవిడ్, దార చిన్న, మాడుగుల రమేష్, గుద్దటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story