Wanaparthy: పెబ్బేరులో విశ్వహిందూ పరిషత్ నూతన కమిటీల ఏర్పాటు!

Wanaparthy: పెబ్బేరులో విశ్వహిందూ పరిషత్ (VHP) నూతన కమిటీలను గురువారం ఏర్పాటు చేశారు. పెబ్బేరు ప్రఖండ, నగర కమిటీల అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 4 Sept 2026 9:28 AM IST
Wanaparthy
X

Wanaparthy: పెబ్బేరులో విశ్వహిందూ పరిషత్ నూతన కమిటీల ఏర్పాటు!

Wanaparthy: విశ్వహిందూ పరిషత్ (VHP) వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రఖండ పరిధిలోని పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలతో పాటు పెబ్బేరు నగర కమిటీలను గురువారం నూతనంగా ఏర్పాటు చేశారు. పెబ్బేరు పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సమావేశానికి VHP ప్రాంత కార్యాలయ ప్రముఖ్ లగిశెట్టి జగదీశ్వరయ్య, విభాగ సహ కార్యదర్శి ఆకారపు వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి బోయిల చంద్రశేఖర్, జిల్లా సహ కార్యదర్శి హర్షవర్ధన్, జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ శెట్టి, సింహారెడ్డి, బాసాల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా సంస్కార శిక్షణ ప్రముఖ్ నాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

అనంతరం విశ్వహిందూ పరిషత్ స్థాపన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెబ్బేరు నగరంలో మూడు ప్రాంతాల్లో స్థాపన దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు యోజన రూపొందించారు.

పెబ్బేరు ప్రఖండ కమిటీకి అధ్యక్షులుగా అస్కాని ఆనంద్, ఉపాధ్యక్షులుగా బిలకంటి వేణుగోపాల్ శెట్టి, కార్యదర్శిగా ఎద్దుల శ్రీనివాస్ రెడ్డి, సహ కార్యదర్శిగా సాలమ్మగారి వెంకట్రామిరెడ్డి, కోశాధికారిగా భీమశెట్టి శ్రీనివాసులు శెట్టి, సత్సంగ్ ప్రముఖ్‌గా ధరూరు శ్రీనివాసులు శెట్టి, ప్రచార ప్రముఖ్‌గా కటిక శ్రీనివాసులు నియమితులయ్యారు.

VHP పెబ్బేరు నగర కమిటీకి అధ్యక్షులుగా పెనుగొండ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా బక్కన్నగారి హనుమంత్ రెడ్డి, కారెడ్డి మోహన్ రెడ్డి, కార్యదర్శిగా పెద్ది బాలరాజు ముదిరాజ్, కోశాధికారిగా ఇల్లూరి శ్రీధర్ గుప్తా, సహ కార్యదర్శిగా సన్నజాజుల రాజు, సత్సంగ్ ప్రముఖ్‌గా నాగరాజు చారి, ప్రచార ప్రముఖ్‌గా శ్రీరంగం నరసింహ నియమితులయ్యారు. పూర్తిస్థాయి కమిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రఖండ అధ్యక్షులుగా నియమితులైన అస్కాని ఆనంద్ మాట్లాడుతూ, RSS మాతృ సంస్థ నుంచి ఏర్పడిన విశ్వహిందూ పరిషత్ హిందూ ధర్మం, సంస్కృతి పరిరక్షణ కోసం పనిచేస్తున్న సామాజిక, ధార్మిక సంస్థ అని తెలిపారు. VHPలో సేవ చేసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. హిందూ బంధువులందరి సహకారంతో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసి సంస్థ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story