Pebberu: పెబ్బేరు బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించిన కలెక్టర్!
Pebberu: పెబ్బేరు బీసీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినుల అస్వస్థత ఘటనపై కలెక్టర్ ఆదర్శ్ సురభి విచారణ. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
Pebberu: పెబ్బేరు బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించిన కలెక్టర్!
Pebberu: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని బీసీ బాలికల వసతి గృహంలో 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం హాస్టల్‌ను సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి భోజనం నాణ్యత, తాగునీరు, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు.
బుధవారం రాత్రి చికెన్‌తో భోజనం చేసిన అనంతరం విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, ఆహారం కలుషితం కావడం కారణమై ఉండవచ్చని కలెక్టర్ తెలిపారు. బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు వివరించారు. ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
తాగునీటి శుద్ధి యంత్రం ఫిల్టర్‌ను వెంటనే మార్చాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు భోజనం వడ్డించే ముందు అధికారులు ఆహార నాణ్యతను పరిశీలించాలని, ఆరోగ్యం, ఆహారం, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రమీల, ఇతర అధికారులు పాల్గొన్నారు.




