Wanaparthy: ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పూర్తి చేయాలి.. కలెక్టర్!

Wanaparthy: వనపర్తి జిల్లాలో ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం.

S.NAGESH, WANAPARTHY
Published on: 26 Nov 2026 9:27 AM IST
Wanaparthy
X

Wanaparthy: ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పూర్తి చేయాలి.. కలెక్టర్!

Wanaparthy: ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలి. ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం నమోదు వేగవంతం చేయాలి. ప్రతి గ్రామంలో రెండు కమ్యూనిటీ సోక్ పిట్లు నిర్మించాలి.

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి, ఈ నెలాఖరులోగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.

బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. వనపర్తి నియోజకవర్గంలో మొత్తం 812 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాల్సి ఉందని, నిర్దేశిత గడువులోగా మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి గ్రామంలో రెండు డ్రైనేజీల చివరన కమ్యూనిటీ సోక్ పిట్లను నిర్మించాలని ఆదేశించారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత భీమా కల్పించేందుకు జిల్లాలోని 268 గ్రామపంచాయతీలు, 80 మున్సిపల్ వార్డుల్లో నిర్దేశిత కేంద్రాల ద్వారా నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.

నమోదు ప్రక్రియ ప్రగతిపై జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.

జిల్లాలో ఇప్పటివరకు 19.66 శాతం ప్రగతితో మొత్తం 36,284 కుటుంబాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అర్హులైన కుటుంబాలందరూ ఈ పథకంలో నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కిమ్యా నాయక్, సీపీఓ హరికృష్ణ, పీడీ హౌసింగ్ విఠోబా, డీఆర్డీఓ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY