Wanaparthy: రత్న మెడికల్ షాప్‌లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు!

Wanaparthy: ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలోని రత్న మెడికల్ షాప్‌లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రష్మిక తనిఖీలు చేశారు. ఎక్స్‌పైరీ మందులు విక్రయించడంతో షాప్‌ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 9 Nov 2026 7:55 PM IST
Wanaparthy
X

Wanaparthy: రత్న మెడికల్ షాప్‌లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు!

వనపర్తి: ఇటీవల రత్న మెడికల్ షాప్ లో ఎక్స్పైరీ మందులు వాడి అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి, కంప్లైంట్ ను బేస్ చేసుకుని తనిఖీలు నిర్వహించామని తెలిపిన వనపర్తి జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ రస్మిక. తనిఖీల అనంతరం ఆమె మాట్లాడుతూ సేల్ చేసిన డ్రగ్ బిల్ జనరేట్ చేయకుండానే ఓ పేషెంట్ కు కాలం చెల్లిన మందులు అమ్మాడని వెల్లడి. దానికి కూడా ఎటువంటి బిల్లు చేయకుండా రిజిస్ట్రేటెడ్ ఫార్మసిస్ట్ లేకుండా సెల్ చేశాడు అది కన్ఫర్మ్ అయిందని తెలిపారు.

నాపై అధికారుల ఆదేశాల మేరకు రత్నం మెడికల్ షాప్ యజమానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే 15 రోజులపాటు షాప్ సీజ్ చేస్తూ లైసెన్స్ ను రద్దు చేసినట్టు ఆమె తెలిపారు. ఫార్మసిస్ట్ అనురాధ తన సర్టిఫికెట్ను 20 ఏళ్లుగా అద్దెకు మాత్రమే ఇచ్చినట్లు ఆమె వెల్లడి. తన ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ రిటర్న్ ఇవ్వాలని డ్రగ్ కంట్రోల్ అధికారులకు విన్నవించుకుంటున్న లైసెన్స్ ఫార్మసిస్ట్ అనురాధ.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA