Wanaparthy: శ్రీరంగనాయక స్వామి ఆలయంలో చోరీ: ఎస్పీ సునీతారెడ్డి పరిశీలన

Wanaparthy: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌ శ్రీరంగనాయక స్వామి ఆలయంలో రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఎస్పీ సునీతారెడ్డి పరిశీలించారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 25 Sept 2026 6:03 PM IST
Wanaparthy
X

Wanaparthy: శ్రీరంగనాయక స్వామి ఆలయంలో చోరీ: ఎస్పీ సునీతారెడ్డి పరిశీలన

వనపర్తి జిల్లా: శ్రీరంగాపూర్‌ మండల కేంద్రంలోని శ్రీరంగనాయక స్వామి ఆలయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు చోరీకి గురయ్యాయి. శుక్రవారం ఉదయం ఆలయ తాళాలు తెరిచిన అర్చకులు విగ్రహాలు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలాన్ని వనపర్తి జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి పరిశీలించారు. ఆలయ అర్చకులను, సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU