Wanaparthy: వనపర్తి బాలికల జూనియర్ కబడ్డీ జట్టు రాష్ట్ర స్థాయికి ఎంపిక
Wanaparthy: వనపర్తి జిల్లా జూనియర్ బాలికల కబడ్డీ జట్టు అశ్వారావుపేట రాష్ట్ర స్థాయి పోటీలకు పయనం. అక్టోబర్ 10 నుంచి 12 వరకు టోర్నమెంట్ నిర్వహణ.
Wanaparthy: వనపర్తి బాలికల జూనియర్ కబడ్డీ జట్టు రాష్ట్ర స్థాయికి ఎంపిక
Wanaparthy: తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వనపర్తి జిల్లా జట్టు శుక్రవారం రోజు బయలుదేరింది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఈ పోటీలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం. కురుమయ్య జట్టు సభ్యులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర కబడ్డీ టోర్నమెంట్‌లో వనపర్తి జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు.
బాలికల జట్టు కూడా ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ఈసీ సభ్యుడు కమలాకర్, పెబ్బేరు జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు నరసింహ గౌడ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.




