Pebbair: ఎమ్మెల్యే గన్‌మెన్ తండ్రి అంత్యక్రియల్లో తూడి మేఘారెడ్డి భరోసా

Pebbair: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గన్‌మెన్ రామకృష్ణ తండ్రి బుచ్చన్న గుండెపోటుతో మృతి చెందగా, ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 3 Aug 2026 10:56 PM IST
Pebbair
X

Pebbair: ఎమ్మెల్యే గన్‌మెన్ తండ్రి అంత్యక్రియల్లో తూడి మేఘారెడ్డి భరోసా

పెబ్బేరు: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వ్యక్తిగత అంగరక్షకుడు రామకృష్ణ తండ్రి కావలి బుచ్చన్న సోమవారం పెబ్బేరు మండలం తిప్పాయపల్లి గ్రామంలో గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వారి స్వగృహానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో యాపర్ల రామ్ రెడ్డి,దయాకర్ రెడ్డి,అక్కి శ్రీనివాస్ గౌడ్, విజయవర్ధన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, వెంకటరమణ, షకీల్, చెలిమిళ్ళ రాముడు, రణధీర్ రెడ్డి, సునీల్, మాలపల్లి సురేందర్ గౌడ్, తిప్పాయపల్లి సర్పంచ్ రాముడు, మహేశ్వర్ రెడ్డి, వీరస్వామి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story