Wanaparthy: రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ నేతల ఘన నివాళి!

Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 20 Aug 2026 1:46 PM IST
Wanaparthy
X

Wanaparthy: రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ నేతల ఘన నివాళి!  

Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి, ఆధునిక సాంకేతిక రంగానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రాజీవ్ గాంధీకి ఘన నివాళులర్పించారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story