Wanaparthy: సూగూరులో పిడుగుపాటుకు మహిళ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు!

Wanaparthy: పెబ్బేరు మండలం సూగూరులో విషాదం: పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపాటుకు మహిళ మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులు వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 23 Sept 2026 7:24 PM IST
Wanaparthy
X

Wanaparthy: సూగూరులో పిడుగుపాటుకు మహిళ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు!

వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పంట పొలాల వద్ద పనులు చేసుకుంటున్న మహిళలపై పిడుగు పడటంతో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల వివరాల ప్రకారం.. సూగూరు గ్రామానికి చెందిన మహిళలు పంట పొలాల వద్ద పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో పిడుగు పడటంతో మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో కుమ్మరి లక్ష్మీ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అనురాధ, సువర్ణలను వెంటనే చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఊహించని విధంగా పిడుగు పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU