Wanaparthy: వనపర్తిలో 7,872 మందికి రూ.20 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ సాయం

Wanaparthy: ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీలో వనపర్తి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. 7,872 మందికి దాదాపు రూ.20 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ సాయం అందింది.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 1 Oct 2026 3:15 PM IST
Wanaparthy
X

Wanaparthy: వనపర్తిలో 7,872 మందికి రూ.20 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ సాయం

వనపర్తి: పేద, మధ్యతరగతి కుటుంబాలకు తీవ్రమైన అనారోగ్యం ఎదురైనప్పుడు వైద్య ఖర్చులు పెద్ద భారంగా మారుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) ద్వారా అందుతున్న ప్రభుత్వ సహాయం ఎంతోమందికి అండగా నిలుస్తోంది. వనపర్తి నియోజకవర్గంలో ఈ పథకాల ద్వారా పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందినట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.

2026 అక్టోబర్ 2 నాటికి వనపర్తి నియోజకవర్గంలో 7,872 మంది లబ్ధిదారులకు రూ.19,98,40,700, అంటే దాదాపు రూ.20 కోట్ల CMRF సహాయం అందించినట్లు తెలిపింది. ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గం రెండో స్థానంలో ఉందని పేర్కొంది.

అదేవిధంగా అత్యవసర, ఖరీదైన వైద్య చికిత్స అవసరమైన వారికి LOC ద్వారా 469 మందికి రూ.9,18,50,000 విలువైన వైద్య సహాయం అందించినట్లు వెల్లడించింది.

ప్రభుత్వ సహాయం కోసం ప్రజలు వనపర్తి నుంచి హైదరాబాద్ వరకు తిరగాల్సిన అవసరం లేకుండా వనపర్తి, హైదరాబాద్‌లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి దరఖాస్తుల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.

దరఖాస్తు, అవసరమైన పత్రాల సమర్పణ, అధికారులతో సమన్వయం, తదుపరి ప్రక్రియ వరకు బాధిత కుటుంబాలకు సహకారం అందించే విధంగా ప్రత్యేక వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

పార్టీలకు అతీతంగా అర్హులైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కార్యాలయం వెల్లడించింది.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU