Narayanpet: PM SHRI క్రీడలకు నారాయణపేట కబడ్డీ జట్ల పయనం

Narayanpet: గండిపేట తెలంగాణ పోలీస్ అకాడమీలో జరగనున్న PM SHRI రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీలకు వెళ్తున్న నారాయణపేట జిల్లా జట్లకు ఘనంగా వీడ్కోలు పలికారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 5 Nov 2026 9:26 PM IST
Narayanpet
X

Narayanpet: PM SHRI క్రీడలకు నారాయణపేట కబడ్డీ జట్ల పయనం

నారాయణపేట: పిఎం శ్రీ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించనున్న అండర్-17 రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనే నారాయణపేట జిల్లా బాలబాలికల జట్లకు జిల్లా విద్యాశాఖ తరఫున అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (AMO) విద్యాసాగర్ ఘనంగా వీడ్కోలు పలికారు.

నవంబర్ 05 మరియు 06, 2026 తేదీలలో గండిపేటలోని తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ పోటీలలో నారాయణపేట జిల్లా తరఫున బాలుర విభాగంలో 12 మంది, బాలికల విభాగంలో 12 మంది చొప్పున మొత్తం 24 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా AMO విద్యాసాగర్ మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టుస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు పూర్తి క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు జిల్లా ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షించారు.

జిల్లా విద్యాశాఖాధికారి డా. ఎం. గోవిందరాజు గారు కూడా క్రీడాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ పోటీలకు బాలుర జట్టుకు గైడ్ టీచర్‌గా ఈశ్వరయ్య, బాలికల జట్టుకు గైడ్ టీచర్‌గా రేణుక వ్యవహరిస్తున్నారు. వీడ్కోలు కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాజశేఖర్ మరియు వెంకటప్ప పాల్గొని క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి విజయాలతో తిరిగి రావాలని జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA