Somasila: కలువాయి రిజర్వాయర్‌ను పరిశీలించిన సోమశిల ఎస్‌ఈ!
Somasila: కలువాయి రిజర్వాయర్‌ను పరిశీలించిన సోమశిల ఎస్‌ఈ రామచంద్రమూర్తి. 150 క్యూసెక్కుల నీరు విడుదల, రైతులు వదంతులు నమ్మవద్దని పిలుపు.
Somasila: కలువాయి రిజర్వాయర్‌ను పరిశీలించిన సోమశిల ఎస్‌ఈ!
Somasila: దక్షిణ కాలువ చివరి ఆయుకట్టు వరకు రైతులకు నీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని సోమశిల ప్రాజెక్ట్ ఎస్ ఈ రామచంద్ర మూర్తి అన్నారు, కలువాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్, రైతు సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు, ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమశిల జలాశయం నుండి కండలేరు హెడ్ రెగ్యులటర్ ద్వారా కలువాయి చెరువుకు 150 క్యూసెక్కులు నీటిని విడుదల చేశామన్నారు.
రైతులు అవసరాలమేరకు నీటిని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు,ఎలోనిన్ ప్రభావంతో త్రీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున జలాశయం లో నీటిని త్రాగు నీటి కోసం వినియోగించు కోవడం జరుగుతుందన్నారు,రైతుల అవసరాలు దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేయడం జరుగుతుందని,సెప్టెంబర్ నుండి, శ్రీశైలం నుండి ఒప్పందం మేరకు 15 టీఎంసీలు కాకుండా అదనంగా 30 టీఎంసీలు రావడం జరుగుతుందన్నారు.
సోమశిల జలాశయం వద్ద కండలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు చాలకాలంగా మరమ్మత్హులకు గురై వున్నాయన్నారు, 15 రోజుల లోపల నూతన గేట్లను బిగించి లికేజ్ ను అరికట్టడం జరుగుతుందన్నారు, సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కలువాయి రిజర్వాయర్ లో నీటి మట్టం తగ్గడంతో దక్షిణ కాలువ రైతులు ఆందోళన చెందుతున్నారని ఎటువంటి వదంతులు నమ్మవద్దన్నారు,సోమశిల జలాశయంలో 19 టీఎంసీలు నీరు ఉందన్నారు, రైతులు అవసరాలు దృష్టిలో ఉంచుకొని జలాశయ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమం లో ప్రాజెక్ట్ అధికారులు,కలువాయి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చల్లా రఘురామ్ రెడ్డి,నీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.




