Kalwakurthy: కల్వకుర్తిలో బీఆర్ఎస్‌వీలోకి భారీ చేరికలు

Kalwakurthy: కల్వకుర్తిలో చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో BRSVలో చేరికలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై స్పందిస్తూ విద్యార్థుల విజయమన్న నేతలు.

SRI SAILAM, KALWAKURTHY
Updated on: 27 July 2026 5:53 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తిలో బీఆర్ఎస్‌వీలోకి భారీ చేరికలు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్‌వీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు._*

💫ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీ చేసిన కృషిని చూసి యువత స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, బాధ్యతలు కల్పిస్తూ కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని తెలిపారు.

📍అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై అయినా స్పందించారు..

"ఇది విద్యార్థుల విజయమే – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా స్వాగతించదగిన పరిణామం"

📍తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన విజయమని అన్నారు.

💫దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు, తల్లిదండ్రులు విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న అవకతవకలు, పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలపై నిరంతరం పోరాడిన ఫలితంగానే ఈ పరిణామం చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు.

💫విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడకుండా, విద్యా వ్యవస్థపై ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించేలా సమగ్ర సంస్కరణలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయని విమర్శించారు.

💫ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షల నిర్వహణ, బాధ్యులపై కఠిన చర్యలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని గోలి శ్రీనివాస్ రెడ్డి కోరారు.

💫చివరిగా,విద్యార్థుల ఐక్యత, ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటమే ఈ విజయానికి కారణమని, విద్యార్థుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

కార్యక్రమంలో కల్వకుర్తి మండలం BRS పార్టీ అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్, నల్లచెరువు మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి,జేపల్లి వార్డు సభ్యులు గోపాల్ నాయక్,BRSV తరుణ్ నాయక్,రాజు, ప్రకాస్, శ్రీరామ్,శివరాం,రాహుల్,వసంత్,అలాజి, వీర,రాంతేజ, మహేష్, రామాంజి,సశాంక్,శివ,మహేష్, మహేష్, ప్రవీణ్,సాయి,చందు, ఆనంద్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story