Bellampalli: బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో 10 అడుగుల కొండచిలువ రెస్క్యూ

Bellampalli: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 10 అడుగుల పొడవు, 30 కిలోల బరువున్న భారీ కొండచిలువను అటవీశాఖ అధికారులు సురక్షితంగా రెస్క్యూ చేశారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 1 Oct 2026 3:12 PM IST
Bellampalli
X

Bellampalli: బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో 10 అడుగుల కొండచిలువ రెస్క్యూ

బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో సుమారు 10 అడుగుల పొడవు, 30 కిలోల బరువు గల కొండచిలువ కనిపించడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ range ఆఫీసర్ శ్రీ పూర్ణచందర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీ రాంబాబు ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భీమా రాజేష్ మరియు స్నేక్ క్యాచర్ అగర్వాల్ దినేష్ కలిసి కొండచిలువను సురక్షితంగా రెస్క్యూ చేసి పట్టుకున్నారు.

అనంతరం కొండచిలువను బెల్లంపల్లి అటవీ ప్రాంతానికి తరలించి, దాని సహజ ఆవాసంలో సురక్షితంగా వదిలిపెట్టారు.

ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తూ, వన్యప్రాణులు లేదా పాములు కనిపించినప్పుడు వాటిని పట్టుకోవడానికి లేదా హాని చేయడానికి ప్రయత్నించకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI