Asifabad: ఆసిఫాబాద్‌లో 12వ రాష్ట్ర సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ షురూ!
Asifabad: ఆసిఫాబాద్‌లో 12వ రాష్ట్ర సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను ఎంపీ నగేష్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ హరిత, ఎస్పీ ప్రారంభించారు.
Asifabad: ఆసిఫాబాద్‌లో 12వ రాష్ట్ర సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ షురూ!
Asifabad: కొమరం భీం జిల్లా క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతాయి. యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 12వ రాష్ట్ర సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితిక పంత్ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాలబాలికలు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ బాలికల పాఠశాల క్రీడా మైదానం రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వేదికగా మారింది. 12వ రాష్ట్ర సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఎంపీ నగేష్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితిక పంత్ ప్రారంభించారు. ఈ పోటీల్లో అండర్-10, అండర్-12, అండర్-14 విభాగాల్లో బాలబాలికలకు వివిధ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నారు.
అండర్-10 విభాగంలో 60, 200 మీటర్ల పరుగు పందాలు, లాంగ్‌జంప్ పోటీలు నిర్వహిస్తున్నారు. అండర్-12 విభాగంలో 60, 300 మీటర్ల పరుగుతో పాటు లాంగ్‌జంప్, కిడ్స్ జావెలిన్ త్రో పోటీలు జరగనున్నాయి. అండర్-14 విభాగంలో 60, 400 మీటర్ల పరుగులు, లాంగ్‌జంప్, ట్రయథ్లాన్, ఏబీసీ, కిడ్స్ జావెలిన్ త్రో పోటీలను నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువ క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. చిన్న వయసులోనే క్రీడలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేయడానికి ఈ ఛాంపియన్‌షిప్ దోహదపడనుంది.




