Mandamarri: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితం గడ్డం వివేక్
Mandamarri: మందమర్రిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని జర్మనీ నుంచి వాట్సాప్ సందేశం ద్వారా స్పష్టం చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి.
Mandamarri: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితం గడ్డం వివేక్
మందమర్రి: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న మంత్రి.. అక్కడి నుంచి లబ్ధిదారులకు సందేశాన్ని వాట్సాప్ ద్వారా పంపించారు.
నిన్న జరిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఓపెన్ లాటరీను ఎలాంటి అవకతవకలు, సిఫారసులు, డబ్బుల దందాకు తావులేకుండా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. అర్హత ఉన్న లబ్ధిదారులకే ఇళ్లు దక్కేలా లాటరీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టామని పేర్కొన్నారు.
లాటరీలో ఇల్లు వచ్చిందని తెలిసిన తర్వాత కొంతమంది లబ్ధిదారులకు ఫోన్ చేసి.. “డబ్బులు ఇస్తేనే ఇల్లు వస్తుంది”, “ఇల్లు కేటాయించాలంటే డబ్బులు ఇవ్వాలి” అంటూ ఎవరైనా అడిగితే అలాంటి మాటలను నమ్మవద్దని మంత్రి సూచించారు.
ఇల్లు పొందిన లబ్ధిదారులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇల్లు కేటాయింపు కోసం ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రభుత్వం పేదలకు అందించాల్సిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను దుర్వినియోగం చేసేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వబోమని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. తప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా మోసం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే లబ్ధిదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, లబ్ధిదారులు ఎలాంటి అపోహలకు గురికావద్దని మంత్రి వివేక్ తన వాట్సాప్ సందేశంలో స్పష్టం చేశారు.




