Kagaznagar: కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.36 కోట్లు: డీఆర్ఎం

Kagaznagar: కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.36 కోట్లు మంజూరయ్యాయని సికింద్రాబాద్ డీఆర్ఎం డా. గోపాలకృష్ణన్ తెలిపారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు వినతులు ఇచ్చారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 12 Nov 2026 3:34 PM IST
Kagaznagar
X

Kagaznagar: కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.36 కోట్లు: డీఆర్ఎం

కాగజ్ నగర్: కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ పర్యటనకు విచ్చేసిన సికింద్రాబాద్ డివిజన్ రైల్వే డి.ఆర్.ఎం డా.గోపాలకృష్ణన్ మర్యాద పూర్వకంగా భేటీ అయిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.

ఈ సందర్భంగా వారికి పలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ను అభివృద్ది పరచాలని, 2,3 నెం. ప్లాట్ ఫామ్లలో ప్యాసింజర్లకు అదనపు సౌకర్యాలు కల్పించాలని, లిఫ్టు మరియు ఎక్సలేటర్లు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.

సానుకూలంగా స్పందించిన డి.ఆర్.ఎం గారు రూ.36కోట్ల తో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కు ప్రణాళికలు తయారు చేశామని, త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెడతామని తెలిపారు.

సికింద్రాబాద్ జంక్షన్ నుంచి కాగజ్ నగర్ మీదగా హౌరా వరకు బెంగాలీ ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త రైలు ప్రవేశపెట్టాలని, లక్నో ఎక్స్ప్రెస్ మరియు భగత్ కి కోటి ఎక్స్ప్రెస్లకు కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో స్టాపేజ్ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరడం జరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కు విశేష స్పందన ఉందని, అదనపు కోచులను జతపరచాలని కోరారు.

సిర్పూర్ రైల్వే స్టేషన్లో కాజీపేట బల్లార్షా ఎక్స్ప్రెస్ ను ఆపాలని, కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సిర్పూర్ టౌన్ వరకు పొడిగించాలని కోరారు. బతుకమ్మ పండుగ సందర్భంగా వేసిన స్పెషల్ ట్రైన్ ను నిరంతరం కొనసాగించి రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైలు యాత్రి సేవా సమితి సభ్యులు పవన్ బళ్దేవా, అరుణ్ లోయ, ప్రయాగ్ తివారి, అనిల్ కుమార్, రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే సీనియర్ డి.ఈ.ఎన్ అభిరామ్, సీనియర్ డిఓఎం తదితరులు పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR