Asifabad: జోడేఘాట్లో కుమురం భీమ్ వర్ధంతికి భారీ బందోబస్తు
Asifabad: జోడేఘాట్లో కుమురం భీమ్ వర్ధంతి వేడుకలకు 600 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను ఎస్పీ నితికా పంత్ పరిశీలించారు.
Asifabad: జోడేఘాట్లో కుమురం భీమ్ వర్ధంతికి భారీ బందోబస్తు
ఆసిఫాబాద్: ఆదివాసీ వీరుడు కుమురం భీమ్ వర్ధంతి సందర్భంగా జోడేఘాట్లో నిర్వహించనున్న కార్యక్రమానికి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు, సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉండటంతో 600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ తెలిపారు.
జోడేఘాట్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. కార్యక్రమ ప్రాంగణం, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ తదితర అంశాలను సమీక్షించారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ, భద్రతా చర్యలను సమన్వయంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కుమురం భీమ్ వర్ధంతి కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి, భద్రతా సిబ్బంది సూచనలు పాటించాలని కోరారు.
ఈ పరిశీలనలో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, వాంకిడి సీఐ వేణుగోపాల్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, కేరమెరి ఎస్ఐ రాజుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




