Bejjur: బెజ్జూర్ మండల మాలి సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా ఆదే అశోక్!
Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల మాలి సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా ఆదే అశోక్ బుధవారం ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికయ్యారు.
Bejjur: బెజ్జూర్ మండల మాలి సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా ఆదే అశోక్!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండల మాలి సంక్షేమ సంఘం నూతన మండల కమిటీ ఎన్నికలు బుధవారం మాలి కుల పెద్దలు, యువకులు, సంఘ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన మండల అధ్యక్షుడిగా ఆదే అశోక్ రెండో సారి ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమానికి మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదే వసంతరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదే నాందేవ్, , వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్లే శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు కొట్రంగి రామకృష్ణ, కాగజ్‌నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు నికాడి బాపురావు హాజరయ్యారు. బెజ్జూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మాలి కుల పెద్దలు, యువకులు పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నూతన కమిటీ వివరాలు:
మండల అధ్యక్షుడు: ఆదే అశోక్ ఉపాధ్యక్షులు: కావిడే గోపాల్, నికాడి మోహన్
ప్రధాన కార్యదర్శి: గుర్లే పోచన్న
కార్యదర్శులు: నికాడి మోహన్, చాటారి రాజు
కోశాధికారి: టాకిరే రణీత్ ప్రచార కార్యదర్శి: నికురి అంజన్న
సలహాదారు: కావిడే సుగుణాకర్
కార్యవర్గ సభ్యులు: గుర్లే అంజయ్య, చాటారి గణపతి, సండే పురుషోత్తం, నికాడి కుమార్, మోర్లే భీమయ్య ఎన్నికయ్యారు
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు సంఘ నాయకులు అభినందనలు తెలిపారు. మాలి కుల ఐక్యతను బలోపేతం చేస్తూ, సంఘ అభివృద్ధి, కుల సంక్షేమం, యువత ప్రోత్సాహం కోసం నూతన కమిటీ కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. మండలంలోని మాలి కులస్తులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.




