Chennur: చెన్నూరులో ఆదివాసీ నర్సు శిరీష హత్యపై కొవ్వొత్తుల ర్యాలీ!
Chennur: తుక్కుగూడలో ఆదివాసీ నర్సు ఊకే శిరీష హత్యకు నిరసనగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
Chennur: చెన్నూరులో ఆదివాసీ నర్సు శిరీష హత్యపై కొవ్వొత్తుల ర్యాలీ!
చెన్నూరు: చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌక్ వరకు శాంతియుతంగా క్రొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి ఆదివాసి సంఘ నాయకులు ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో మళ్లీ పునరావృతం కాకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
రోజురోజుకు మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు, దాడులు చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు.




