Penchikalpet: పెంచికల్‌పేట్ రేషన్ డీలర్‌పై 6A కేసు నమోదు

Penchikalpet: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ రేషన్ దుకాణంలో 4.72 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించి డీలర్‌పై అధికారులు 6A కేసు నమోదు చేశారు.

SRINIVAS, KOUTALA
Published on: 19 Nov 2026 9:23 PM IST
Penchikalpet
X

Penchikalpet: పెంచికల్‌పేట్ రేషన్ డీలర్‌పై 6A కేసు నమోదు

పెంచికల్‌పేట్‌: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలంలో రేషన్ దుకాణంపై అధికారులు తనిఖీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా బియ్యం నిల్వల్లో తేడా ఉండడంతో డీలర్‌పై 6A కేసు నమోదు చేశారు. పెంచికల్‌పేట్ మండలంలోని రేషన్ దుకాణం నంబర్ 2416007పై జిల్లా పౌర సరఫరాల అధికారి వాజిద్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ రాజ్‌కుమార్, పెంచికల్‌పేట్ గిర్దావర్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

దుకాణంలోని పీడీఎస్ బియ్యం నిల్వలను రికార్డులతో సరిపోల్చి పరిశీలించగా 4.72 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిల్వల్లో వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో సంబంధిత రేషన్ డీలర్ పాలకుర్తి శ్రీనివాస్‌పై 6A సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడినా, ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA