Koutala: కన్నెపల్లిలో ఘనంగా బాల గ్రామ సభ, నెహ్రూ జయంతి వేడుకలు

Koutala: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో నెహ్రూ జయంతి సందర్భంగా ఘనంగా బాల గ్రామ సభ నిర్వహించి, బాలల హక్కులపై అవగాహన కల్పించారు.

SRINIVAS, KOUTALA
Published on: 14 Nov 2026 11:52 PM IST
Koutala
X

Koutala: కన్నెపల్లిలో ఘనంగా బాల గ్రామ సభ, నెహ్రూ జయంతి వేడుకలు

కౌటాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని కన్నెపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం MPUPS పాఠశాల ఆవరణలో బాల గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం బాల గ్రామ సభ నిర్వహించి విద్యార్థులకు బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, గ్రామ అభివృద్ధిలో పిల్లల భాగస్వామ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోర్లె పార్వతి, ఉపసర్పంచ్ మోర్లె సమత-రాజు, పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ, వార్డు సభ్యులు చెన్నూరి తిరుమలేష్, సోనులే గణేష్, అదే మంజుల-శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు రాథోడ్ కృష్ణ, అవినాష్, గ్రామ యువ నాయకులు మోర్లె పాండురంగ్, జూనారి భీమ్రావు, నాగోషే దశరథ్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA