Asifabad: చింతలమానేపల్లి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన బీఆర్‌ఎస్

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.

SRINIVAS, KOUTALA
Published on: 7 Sept 2026 4:24 PM IST
Asifabad
X

Asifabad: చింతలమానేపల్లి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన బీఆర్‌ఎస్

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల ఎంపిడిఓకి, చింతలమానేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు ప్రజావాణి లో వినతి పత్రం అందజేశారు.

మహాలక్ష్మి పథకం హామీల అమలు, రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సహాయం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, విద్యార్థులకు విద్యా భరోసా, అర్హులకు రూ.4,000 పింఛన్, ఆటో, ట్యాక్సీ కార్మికులకు ఆర్థిక సహాయం.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చిన హామీల అమలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని విన్నవించారు.ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి వినతి పత్రాన్ని అందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చింతమానేపల్లి మండల నాయకులు, కాగజ్ నగర్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story