Asifabad: చింతలమానేపల్లి మండల సమాఖ్యలో చోరీ.. డాగ్ స్క్వాడ్ తనిఖీలు

Asifabad: కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి నక్షత్ర మండల సమాఖ్య కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కంప్యూటర్, ప్రొజెక్టర్, ఇన్వర్టర్ చోరీ చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 1 Oct 2026 8:29 PM IST
Asifabad
X

Asifabad: చింతలమానేపల్లి మండల సమాఖ్యలో చోరీ.. డాగ్ స్క్వాడ్ తనిఖీలు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: చింతలమానేపల్లి మండలంలోని నక్షత్ర మండల సమాఖ్య కార్యాలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. కార్యాలయంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి కంప్యూటర్, ప్రింటర్, ప్రొజెక్టర్‌ విసి సెట్, ఇన్వర్టర్ తో పాటు ఇతర సామగ్రిని దొంగిలించారు.

కార్యాలయంలో సామగ్రి కనిపించకపోవడంతో సెర్ఫ్ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏపీఎం మోహన్ దాస్ తెలిపారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన కార్యాలయాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాల సేకరణ కోసం డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఆధారాలను సేకరించారు.

చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.