Asifabad: ఆసిఫాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఎఫ్‌ఎంజీ వైద్యుల నిరసన!
Asifabad: ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఎఫ్‌ఎంజీ వైద్యుల ఆందోళన. జీవో 32 ప్రకారం స్టైపెండ్ చెల్లించాలని డిమాండ్.
Asifabad: ఆసిఫాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఎఫ్‌ఎంజీ వైద్యుల నిరసన!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఎఫ్‌ఎంజీ) వైద్యులు నిరసన చేపట్టారు. ఇంటర్న్‌షిప్ చేస్తున్న తమకు జీవో నంబర్ 32 ప్రకారం నెలకు రూ.29,792 స్టైపెండ్ చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం రూ.5,000 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, ఇంటర్న్‌షిప్ కోసం ఇక్కడికి వచ్చిన తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. నెలకు అందుతున్న రూ.5,000తో కనీస అవసరాల ఖర్చులు కూడా తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
వైద్య విద్యను పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతున్న తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 32 ప్రకారం అర్హులైన ఎఫ్‌ఎంజీ వైద్యులకు నెలకు రూ.29,792 స్టైపెండ్ చెల్లించేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.




