Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో ఉపాధి కూలీల తిప్పలు.. అడవిలోనే వంటలు!
Asifabad: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీల అవస్థలు. ఎండ తీవ్రతకు తోడు కనీస వసతులు లేక ఇబ్బందులు.
Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో ఉపాధి కూలీల తిప్పలు.. అడవిలోనే వంటలు!
Asifabad: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనుల కోసం గ్రామం నుంచి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తుండటంతో మధ్యాహ్నానికి ఆకలితో అలమటించే పరిస్థితి నెలకొంది. దీంతో కూలీలు తమంతట తామే అక్కడే వంట చేసుకుని భోజనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక ఉపాధి హామీ పనుల వద్ద కూలీల కోసం చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎండ తీవ్రత మధ్య కనీస వసతులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉపాధి కల్పిస్తున్నా కూలీలకు అవసరమైన సౌకర్యాలు మాత్రం అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story




