Asifabad: అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్సీ
Asifabad: ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట్ మండలంలో అనారోగ్య బాధితురాలికి రూ. 17,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్సీ దండే విఠల్ అందజేశారు.
Asifabad: అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్సీ
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట్ మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని శాసనమండలి సభ్యులు MLC దండే విఠల్ పేర్కొన్నారు.
పెంచికలపేట్ మండలంలోని ఎల్లూరు గ్రామానికి చెందిన జనగం భారతి ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు.
వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కోసం వారు ముఖ్యమంత్రి సహాయనిధికి (CMRF) దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం స్పందించి రూ. 17,000 మంజూరు చేసింది. ఈ మేరకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్సీ దండే విఠల్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెంచికల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సముద్రాల రాజన్న, పెంచికల్ పేట్ సర్పంచ్ షేక్ ఉస్మాన్, ఉప సర్పంచ్ శేఖర్ ,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి సిరిపురం సదాశివ్, మండల కాంగ్రెస్ నాయకులు రాచకొండ కృష్ణ, రమేష్, అత్తహ బెగి , ఇలియాస్, సంతోష్,కార్యకర్తలు పాల్గొన్నారు.




