Asifabad: బెజ్జూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సలుగుపెల్లి మలుపు వద్ద బైక్ అదుపుతప్పిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Asifabad: బెజ్జూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగజ్ నగర్ నుండి బైక్ పై బెజ్జూర్ కి వస్తున్న క్రమంలో బెజ్జూర్ మండలం సలుగుపెల్లి గ్రామ మూల మలుపు వద్ద బైక్ అదుపుతప్పి కిందపడింది.
బైకుపై ఉన్న రేచిని గ్రామానికి చెందిన నికురి అనంతరావు, నికురి మల్లయ్య, నికురి రాజయ్య ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నికురి అనంతరావుకు తీవ్ర గాయాలు కాగా, నికురి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
గాయపడిన క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




